News January 24, 2025
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.
Similar News
News February 9, 2025
PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు

మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి జిమ్‌లో ఉన్న ఫొటోను మరో హీరో వరుణ్ తేజ్ పంచుకున్నారు. జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC16లో బిజీగా ఉండగా ‘సంబరాల ఏటి గట్టు’తో సాయి ధరమ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమాతో వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News February 9, 2025
ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్‌తో నిలిచిన మ్యాచ్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెటైర్లు

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఎవరైనా ఎలక్ట్రీషియన్ స్టేడియంలో దగ్గరలో ఉంటే రావాలని ENG ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వసతులతో మ్యాచ్ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ఆగితే ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కుతుందని కొందరు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
News February 9, 2025
క్రమశిక్షణ తప్పినవారిని ఉపేక్షించం: తుమ్మల

TG: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కష్టపడే కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజామోదం ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అని ఆయన పేర్కొన్నారు.