News August 10, 2024
వైద్య విద్యార్థులకు GOOD NEWS.. స్టైఫండ్ పెంపు

AP: వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్ను 15% పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్ స్టూడెంట్స్కు ప్రస్తుతం ₹70,000 ఇస్తుండగా, ఇకపై ₹80,500 అందిస్తారు. MBBS హౌస్ సర్జన్స్కు ఇచ్చే ₹22,527లను ₹25,906కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకూ స్టైఫండ్ పెరిగింది.
Similar News
News November 26, 2025
సర్పంచులకు జీతం ఎంతంటే?

TG: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సర్పంచుల జీతంపై చర్చ జరుగుతోంది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఉండేది. ఆ తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఎంపీటీసీలకు రూ.6,500, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13,000, జడ్పీ ఛైర్మన్లకు రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/