News August 10, 2024

వైద్య విద్యార్థులకు GOOD NEWS.. స్టైఫండ్ పెంపు

image

AP: వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను 15% పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ప్రస్తుతం ₹70,000 ఇస్తుండగా, ఇకపై ₹80,500 అందిస్తారు. MBBS హౌస్ సర్జన్స్‌కు ఇచ్చే ₹22,527లను ₹25,906కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకూ స్టైఫండ్ పెరిగింది.

Similar News

News February 11, 2025

రేపే ‘VD12’ టీజర్.. భారీగా అంచనాలు!

image

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి రేపు రిలీజయ్యే టీజర్‌పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం. తమిళ టీజర్‌కు సూర్య, హిందీకి రణ్‌బీర్ కపూర్ వాయిస్ అందించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్మాత నాగవంశీ కూడా ‘టైగర్’ ఎమోజీని ట్వీట్ చేశారు.

News February 11, 2025

ఆ చట్టం రద్దుతో అదానీకి ప్రయోజనం!

image

డొనాల్డ్ ట్రంప్ <<15426089>>FCPA<<>> చట్టాన్ని సస్పెండ్ చేయడంతో భారత వ్యాపారి గౌతమ్ అదానీకి ఊరట లభించే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అభియోగాలను రద్దుచేసే అవకాశమైతే లేదు గానీ విచారణను నిలిపివేస్తారు. అటార్నీ జనరల్ పామ్ బొండి సవరణలతో కూడిన చట్టాన్ని తీసుకురాగానే దాని ఆధారంగా విచారణ ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం కోసం నజరానాలు ఇవ్వడం నేరం కాదని ట్రంప్ నొక్కి చెబుతుండటంతో చట్టం తీరుతెన్నులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

News February 11, 2025

రూ.70 కోట్లు దాటిన ‘తండేల్’ కలెక్షన్లు

image

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. FEB 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై నాలుగు రోజుల్లో రూ.73.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ‘బ్లాక్‌బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని K.మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు, జాలర్ల వాస్తవిక కథ ఆధారంగా తెరకెక్కించిన ‘తండేల్’కు పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

error: Content is protected !!