News September 30, 2024
రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్
TG: మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికిపైగా అన్నదాతలకు మాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మాఫీ కాని మరో 1.50లక్షల మందిని నిర్ధారించారు. మొత్తం 5 లక్షలకుపైగా అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే వారి అకౌంట్లలో రూ.5వేల కోట్లను జమ చేయనున్నారు.
Similar News
News October 5, 2024
ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు.. కారణం అదే!
యూపీలోని అమేథీలో గురువారం ఇద్దరు పిల్లలు సహా దంపతులను హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. నిందితుడు చందన్ వర్మ.. సునీల్ కుమార్ (35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు అతడి భార్య పూనం (32), ఇద్దరు చిన్న పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం సూసైడ్ చేసుకునేందుకు యత్నించగా మిస్ ఫైర్ అయి బతికిపోయాడు. చందన్, పూనం మధ్య వివాహేతర సంబంధం ఉందని, విభేదాలతో ఆమె కేసు పెట్టడమే దీనికి కారణమని పోలీసులు గుర్తించారు.
News October 5, 2024
ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తా: గోపీచంద్
తాను చేసిన విలన్ పాత్రలు బలమైన ముద్ర వేశాయని, అందుకే ఫ్యాన్స్ తనను మళ్లీ ఆ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారని హీరో గోపీచంద్ అన్నారు. ప్రభాస్ సినిమాలో అయితేనే తాను విలన్‌గా నటిస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కొన్ని సినిమాల రిజల్ట్ రిలీజ్‌కు ముందే తెలిసిపోతుందని, కానీ నమ్మకంగా ప్రమోషన్ చేస్తామని చెప్పారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆయన నటించిన ‘విశ్వం’ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.
News October 5, 2024
భయానకం.. 600 మందిని కాల్చేశారు
ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ JNIM దాడుల్లో గంటల వ్యవధిలోనే 600 మంది ప్రజలు చనిపోయారు. AUG 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌లపై వచ్చిన దుర్మార్గులు కనిపించినవారినంతా కాల్చేశారు. ఆ మృతదేహాలను తొలగించడానికి 3 రోజలు పట్టింది. ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 20వేల మంది మరణించారు.