News December 13, 2024

H1B, L1 వీసాదారుల భాగస్వాములకు గుడ్‌న్యూస్

image

H1B, L1 వీసాదారుల భాగస్వాములకు US గుడ్‌న్యూస్ చెప్పింది. వీరికి ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు 180రోజులున్న కాలపరిమితి ఈ ప్రకటనతో 540రోజులకు పెరిగింది. వచ్చే ఏడాది జనవరి 13నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే4, ఆ తర్వాత రెన్యూవల్‌కి అప్లై చేసుకున్న లేదా పెండింగ్‌లో ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.

Similar News

News October 20, 2025

ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

image

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్‌గా నయనతార, స్పెషల్ రోల్‌లో వెంకీ మామ కనిపించనున్నారు.

News October 20, 2025

రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 20, 2025

మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

image

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.