News December 13, 2024
H1B, L1 వీసాదారుల భాగస్వాములకు గుడ్‌న్యూస్
H1B, L1 వీసాదారుల భాగస్వాములకు US గుడ్‌న్యూస్ చెప్పింది. వీరికి ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు 180రోజులున్న కాలపరిమితి ఈ ప్రకటనతో 540రోజులకు పెరిగింది. వచ్చే ఏడాది జనవరి 13నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే4, ఆ తర్వాత రెన్యూవల్‌కి అప్లై చేసుకున్న లేదా పెండింగ్‌లో ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.
Similar News
News January 20, 2025
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి?.. హోంమంత్రి ఏమన్నారంటే?
AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ప్రచారంపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘అంతా దైవేచ్ఛ. నుదుటిపై రాసి ఉన్నది ఎవరూ తీయలేరు. లోకేశ్‌కు రాసిపెట్టి ఉందేమో చూద్దాం’ అని అన్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలతో పాటు అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే.
News January 20, 2025
పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందో లేదో స్పష్టత రావాలి: DGP
AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కలకలంపై DGP ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ ఎగిరిందో లేదా స్పష్టత రావాల్సి ఉందని, సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందన్నారు. RSI మాత్రమే డ్రోన్ ఎగిరినట్టు చెబుతున్నారని వెల్లడించారు. పవన్ సాలూరు పర్యటనలో నకిలీ IPS అధికారి ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని DGP వివరించారు. ఆయన భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
News January 20, 2025
రాహుల్ గాంధీకి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు
పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి కాంగ్రెస్ ప్లీనరీలో HM అమిత్ షా ‘హత్యకేసులో నిందితుడు’ అని RG ఆరోపించారు. దీంతో ఆయనపై BJP నేత నవీన్ ఝా దావా వేశారు. తన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవంటూ 2024 FEBలో రాహుల్ వేసిన క్వాష్ పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టేసింది. కేసుపై మరింత పరిశీలన అవసరమని నేడు సుప్రీంకోర్టు పేర్కొంది.