News September 14, 2024
పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్త

పెన్షన్లు తీసుకునే వృద్ధులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల(DLC)ను ఇంటివద్దే సమర్పించవచ్చని ఇండియా పోస్ట్ వెల్లడించింది. ఇందుకోసం పెన్షనర్ల సంఘాలు, బ్యాంకులు, UIDAIలతో పోస్టల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోనుంది. జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్లు DLCలు సమర్పించవచ్చు. రాలేని వారికి ఇంటి వద్దే సేవలు అందిస్తారు. నవంబర్ 1-30 వరకు DLC క్యాంపెయిన్ను దేశంలో ఇండియా పోస్ట్ నిర్వహించనుంది.
Similar News
News January 30, 2026
తిరుమల వేంకన్నతోనే ఆటలు.. భక్తుల్లో ఆగ్రహం

తిరుమల క్షేత్రం స్వార్థ రాజకీయాలతో నిత్యం వార్తల్లో ఉంటోంది. కల్తీ నెయ్యి ఆరోపణలతో అధికార, విపక్షాలు హద్దులు దాటుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. బాధ్యత కలిగిన MLAలు సైతం శ్రీవారిపై రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. AI వీడియోలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరగా నిజనిజాలను నిగ్గు తేల్చాలని, వివాదానికి ముగింపు పలకాలని పలువురు కోరుతున్నారు.
News January 30, 2026
తిరుమల లడ్డూ ఘటనలో నిజమే గెలిచింది: కాకాణి

తిరుమల లడ్డు ప్రసాదంపై ఇటీవల జరిగిన అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు పూర్తిగా అబద్ధమని సీబీఐ నివేదికతో స్పష్టమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిజమే గెలిచిందని పేర్కొన్నారు. గురువారం ఆయన నగరంలోని మాగుంట లే అవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నాయకులు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.