News September 14, 2024

పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్త

image

పెన్షన్లు తీసుకునే వృద్ధులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల(DLC)ను ఇంటివద్దే సమర్పించవచ్చని ఇండియా పోస్ట్ వెల్లడించింది. ఇందుకోసం పెన్షనర్ల సంఘాలు, బ్యాంకులు, UIDAIలతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ సమన్వయం చేసుకోనుంది. జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్లు DLCలు సమర్పించవచ్చు. రాలేని వారికి ఇంటి వద్దే సేవలు అందిస్తారు. నవంబర్ 1-30 వరకు DLC క్యాంపెయిన్‌ను దేశంలో ఇండియా పోస్ట్ నిర్వహించనుంది.

Similar News

News October 11, 2024

నందిగం సురేశ్‌కు అస్వస్థత

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

News October 11, 2024

డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన కేజ్రీవాల్‌

image

అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీల‌ను స‌గానికి త‌గ్గిస్తాన‌న్న డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వ‌ర‌కు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తే BJP తరఫున ప్ర‌చారం చేస్తాన‌ని కేజ్రీవాల్ ఇటీవల స‌వాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

News October 11, 2024

జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

image

2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బ‌హుమ‌తి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వ‌రించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 111 మంది స‌భ్యులు, 31 సంస్థ‌ల‌ను నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. ఈ ఏడాది పుర‌స్కారానికి 286 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించిన క‌మిటీ నిహాన్ హిడాంక్యోను పుర‌స్కారానికి ఎంపిక చేసింది.