News August 29, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా 48 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు SCR అధికారులు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 25 మధ్య వీటిని నడపనున్నట్లు వెల్లడించారు. తిరుపతి-మచిలీపట్నం, కాకినాడ టౌన్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగర్‌సోల్, కాచిగూడ-తిరుపతి మధ్య ఇవి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News September 18, 2024

మండుతున్న ఎండలు.. 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

రెండు వారాల క్రితం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తగా ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్న ఏపీలోని కావలిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి గాలులు పూర్తిగా పొడిగా మారడం, మేఘాలు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏసీ, ఫ్యాన్లు లేకుండా ఉండలేకపోతున్నామని, వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

News September 18, 2024

పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

image

AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

News September 18, 2024

వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!

image

AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.