News July 18, 2024
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్లలో స్టాప్‌ల కొనసాగింపు

తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు <<13647267>>స్టాప్<<>>లను కొనసాగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్టింగ్ పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. నర్సాపుర్- లింగంపల్లి, చెన్నై- HYD, భువనేశ్వర్- SEC రైళ్లు నల్గొండలో ఆగనున్నాయి. మొత్తం జాబితాను పైఫొటోలో చూడవచ్చు.
Similar News
News February 15, 2025
భారత్‌లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.
News February 15, 2025
మహాకుంభమేళా.. 20,000 మంది ఆచూకీ లభ్యం

కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతున్న మహాకుంభమేళాలో కుటుంబాల నుంచి మిస్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే AI బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా 20K మందిని వారి ఫ్యామిలీల వద్దకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అత్యధికంగా 8,725 మందిని కనిపెట్టినట్లు చెప్పారు. విడిపోయిన భక్తులను కాపాడటంలో UNICEF, NGOలు, వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
News February 15, 2025
ఆమెకు 74 ఏళ్లు.. అయితేనేం!

పిల్లలు, మనవళ్లతో సాధారణ జీవితం గడుపుతున్న ఓ ముసలవ్వను సోషల్ మీడియా స్టార్‌ని చేసేసింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌కు చెందిన 74 ఏళ్ల సుమన్ ధామనే తన మనవడి సాయంతో యూట్యూబ్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి సంప్రదాయ వంటకాలు, పావ్ బాజీ వంటి రెసిపీలు కుకింగ్ చేసిన వీడియోలను YTలో అప్లోడ్ చేయడంతో ఆమె లక్షల మంది ప్రేమను పొందారు. ప్రస్తుతం ‘Aapli Aaji’ ఛానల్‌కు 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.