News August 23, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి శుభవార్త

image

TG: రేషన్ కార్డులు ఉన్న వారికి రాయితీపై గోధుమలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం HYDలో మాత్రమే వీటిని అందిస్తుండగా, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అటు రూ.500కు గ్యాస్ సిలిండర్ల పంపిణీపైనా ఆయన సమీక్షించారు. వినియోగదారులకు సిలిండర్ సరఫరా అయిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు.

Similar News

News January 23, 2026

బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

image

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని బీపీ ప్ర‌భావితం చేస్తుంది. అయితే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల హైబీపీని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, అరటి పళ్లు, ఓట్స్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, సాల్మ‌న్, మాకేరెల్ చేపలను తీసుకోవాలి. అలాగే సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసం, సోడాలు, శీత‌ల పానీయాలు, ఎన‌ర్జీ డ్రింక్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బ‌ర్గ‌ర్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 23, 2026

రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు బంద్!

image

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రేపు 4వ శనివారం కాగా ఎల్లుండి ఆదివారం. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. ఇక వారానికి 5 రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు మంగళవారం(27న) సమ్మెకు దిగనున్నాయి. దీంతో ఆరోజు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు. ఫలితంగా వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.

News January 23, 2026

₹11,399 కోట్లతో 6000 KM రోడ్ల అభివృద్ధి: కోమటిరెడ్డి

image

TG: IT, AI లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని HYDలో జరిగిన ‘ఏస్ టెక్ హైదరాబాద్-2026’ సదస్సులో తెలిపారు. ₹11399 కోట్లతో 6000 KM రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బెటర్ లైఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకానమీకి ట్రాన్స్‌పోర్ట్ చాలా కీలకమన్నారు.