News July 17, 2024
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

AP: రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కందిపప్పును రూ.67కే ఇవ్వనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోనే ఈ-పొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది.
Similar News
News February 15, 2025
అలాంటి కథలతో సినిమాలు తీయాలి: మంత్రి సత్యకుమార్

AP: సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతమైన సినిమాలు తీయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వీరప్పన్, పూలన్ దేవి లాంటి బందిపోట్లు, స్మగ్లర్ల జీవితకథలతో సినిమాలు తీయడమేంటని ప్రశ్నించారు. వీటితో చిన్నారులను స్మగ్లర్లుగా మార్చమని సందేశమిస్తున్నారా అని అన్నారు. జన్మించిన ఊరు కోసం, సమాజం కోసం మంచి చేసే వారి కథలు సినిమాలుగా తీయాలని సూచించారు.
News February 15, 2025
WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ 164 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్ స్కివర్ బ్రంట్(80*) అదరగొట్టగా కెప్టెన్ హర్మన్ ప్రీత్(42) ఫర్వాలేదనిపించారు. యస్తికా(11) మినహా ఇతర ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్నాబెల్ 3, శిఖా పాండే 2, కాప్సే, మిన్నూ చెరో వికెట్ వికెట్ తీశారు. DELHI టార్గెట్ 165.
News February 15, 2025
PHOTO: మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వగా పాటల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా సెట్‌లో ధోతీలో ఉన్న చిరంజీవి బ్యాక్ ఫొటోను దర్శకుడు పంచుకున్నారు. కీరవాణి కంపోజిషన్‌లో చిరు స్టెప్పులతో అదరగొట్టారని రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.