News December 3, 2024
RTC ప్రయాణికులకు శుభవార్త
AP: ఆర్టీసీ ప్రయాణికులకు APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ శుభవార్త చెప్పారు. కొత్తగా 1600 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా నడుపుతామని పేర్కొన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో విధివిధానాలు ప్రకటించి, పథకం అమలు చేస్తామని వివరించారు.
Similar News
News January 18, 2025
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్‌లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
News January 18, 2025
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు?
TG: ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్సుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే ఏప్రిల్/మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
News January 18, 2025
గడ్డకట్టే చలి.. ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం
ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. కాగా అర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వాషింగ్టన్ డీసీలో 20న -12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.