News March 7, 2025

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

image

TG: ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏ ప్రకటించారు. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

గంభీర్‌పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

image

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.

News November 28, 2025

బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్‌మెంట్ ఆఫీస్‌ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bapatla.ap.gov.in/

News November 28, 2025

పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి!

image

AP: పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై Dy.CM కార్యాలయం పోలీసులకు సమాచారమిచ్చింది. ‘శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నప్పుడు, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. అతను రాజోలు నియోజకవర్గ YCP కార్యకర్తగా సమాచారమందింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా SP దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపింది.