News March 7, 2025
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

TG: ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏ ప్రకటించారు. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
గ్రూప్-1 ఫలితాల మూల్యాంకనంలో లోపాలు: ప్రసన్న హరికృష్ణ

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడంపై MLC అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని అన్నారు. సబ్జెక్టులపై అవగాహన లేని వారితో వాల్యుయేషన్ చేయించారని, EM బ్లూప్రింట్‌ను TMలోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వడంతో TM వారికి అన్యాయం జరిగిందన్నారు. టాప్-100లో TM, ఉర్దూ మీడియం వారు ఎందరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
News March 16, 2025
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్‌కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.
News March 16, 2025
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. 91 రన్స్‌కి పాక్ ఆలౌట్

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాక్ 91 పరుగులకే ఆలౌటైంది. ఖుశ్‌దిల్ షా(30 బంతుల్లో 32) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(18), జహాందాద్ ఖాన్(17) మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. 11 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. కివీస్ బౌలర్లలో డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3, సోధీ 2, ఫౌక్స్ ఒక వికెట్ తీశారు.