News February 16, 2025

శబరిమల భక్తులకు గుడ్ న్యూస్

image

శబరిమల అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. 18 మెట్లు ఎక్కగానే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఆలయం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయించారు. భక్తులు ఈ మెట్లను ఎక్కగానే సన్నిధికి చేరుకోవడానికి ఎడమ వైపునకు మళ్లించేవారు. దీంతో దర్శనానికి 500 మీటర్ల ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని దాటుకొని వెళ్లాల్సి వచ్చేది. మార్చి 14 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

Similar News

News January 16, 2026

మళ్లీ తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. 10 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 10 రోజులు ఈ తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలుగా ఉంటాయని వెల్లడించారు.

News January 16, 2026

ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

image

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

News January 16, 2026

ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.