News October 28, 2024

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

AP: పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారి కోసం ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ గైడెన్స్ నిపుణులను విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. దీనిద్వారా విద్యార్థులను ఉత్తమ భవిష్యత్‌ వైపు మార్గనిర్దేశనం చేసేందుకు అవకాశం ఉంటుంది. యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా టీచర్లకు కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై నేటి నుంచి 3 రోజులు విజయవాడలో శిక్షణ ఇవ్వనుంది.

Similar News

News July 10, 2025

LORDS TEST: నితీశ్ స్థానంలో అర్ష్‌దీప్?

image

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టుకు భారత్ రెండు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచులో అంతగా ఆకట్టుకోని తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి స్థానంలో పేసర్ అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రాను ఆడించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. జట్టు అంచనా: జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, గిల్ (కెప్టెన్), పంత్, జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, అర్ష్‌దీప్.

News July 10, 2025

GPO రెండో విడత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

TG: గ్రామ పాలన అధికారుల(GPO) భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రాగా 3,550 మంది ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్వోలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 16లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న GPO పరీక్ష నిర్వహించనున్నారు.

News July 10, 2025

BREAKING: ఢిల్లీలో భూకంపం

image

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.