News November 20, 2024
స్కూల్ విద్యార్థులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. నవంబర్ 26వ తేదీ వరకు విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జెండర్, కేటగిరీ, ఏరియా(రూరల్/అర్బన్), డిజెబిలిటీ, పరీక్ష మాధ్యమం ఫీల్డ్స్‌లో దరఖాస్తుల సవరణ అవకాశం నవంబర్ 26 తర్వాత రెండు రోజులు తెరిచి ఉంటుంది. ఏపీలో 15, TGలో 9 JNVలు ఉండగా, ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
Similar News
News December 12, 2024
హిందూ సాధువు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు
హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ విచారణ తేదీని ముందుకు జరిపేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అభ్యర్థించిన లాయర్ రబీంద్ర ఘోష్‌కు ఆథరైజేషన్ పవర్ లేదని పేర్కొంది. ఇస్లామిస్టుల దాడితో కృష్ణదాస్ లాయర్ ఆస్పత్రి పాలవ్వడం తెలిసిందే. దీంతో ఆయన కోసం పోరాడేందుకు ఘోష్ వచ్చారు. ‘విచారణ తేదీపై పిటిషన్ వేయగానే 30 మంది లాయర్లు నన్ను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు’ అని ఆయన తెలిపారు.
News December 12, 2024
మగాడికి కాస్త ఊరట: ‘మనోవర్తి’కి సుప్రీంకోర్టు సూచనలు (1)
బెంగళూరు టెకీ, భార్యా బాధితుడు అతుల్ సుభాష్ సూసైడ్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. విడాకుల కేసుల్లో మనోవర్తిని నిర్ణయించేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులూ అనుసరించాల్సిన సూచనలివే..
* భార్యాభర్తల ఆర్థిక, సామాజిక హోదా పరిశీలన
* భవిష్యత్తులో భార్య, పిల్లల అవసరాల పరిశీలన
* భార్యాభర్తలిద్దరి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు పరిశీలన
==> <<14855954>>NEXT PART<<>>
News December 12, 2024
మగాడికి కాస్త ఊరట: ‘మనోవర్తి’కి సుప్రీంకోర్టు సూచనలు (2)
* దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు * అత్తారింట్లో భార్య జీవన ప్రమాణాలేంటి? * కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె ఉద్యోగం మానేసిందా? * మనోవర్తి చెల్లిస్తున్నప్పుడు భర్త ఆర్థిక హోదా, ఆదాయం, ఇతర బాధ్యతలు ఏంటి? * ఇదేమీ సింపుల్ ఫార్ములా కానప్పటికీ మనోవర్తి నిర్ణయంలో తోడ్పడతాయని సుప్రీంకోర్టు తెలిపింది. మనోవర్తి చెల్లించాల్సిన మొత్తం ఏ భర్తకూ శిక్ష కారాదని, అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలని పేర్కొంది.