News March 11, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

APలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం మారుస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని, ఒకటో తరగతికి రెండు పుస్తకాలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించామని, టీచర్లకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News March 23, 2025
వర్ష బాధిత రైతులకు రేపు జగన్ పరామర్శ

AP: మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు చేతికొచ్చిన అరటి తోటలు నేలకొరిగాయి. ఈ క్రమంలో ఆయన వాటిని పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఈ రాత్రికి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అవుతారు. ఈ నెల 27న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 23, 2025
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, HYD తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
News March 23, 2025
మొబైల్ కొనేటప్పుడు ఇది చూస్తున్నారా?

ప్రస్తుతం ఫోన్ కొనేటప్పుడు అందరూ అంటుటు (anTuTu) స్కోర్ చూస్తున్నారు. ఫోన్ స్పీడ్, గ్రాఫిక్స్, ర్యామ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటివాటిని పరిశీలించి ఒక నంబర్ ఇస్తారు. దీనినే అంటుటు అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అంత పవర్‌ఫుల్ అని అర్థం. ఎలాంటి గేమ్స్ ఆడినా ఫోన్ హ్యాంగ్ కాదు. ప్రస్తుతం ఐకూ13 మొబైల్ 26,98,668 స్కోర్‌తో టాప్‌లో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ 26,66,229తో సెకండ్ ప్లేస్‌లో ఉంది.