News July 3, 2024
విద్యార్థులకు గుడ్‌న్యూస్

TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
Similar News
News December 6, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

మార్గశిర మాసం శనివారం సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంతమంతా కిటకిటలాడింది.
News December 6, 2025
తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.
News December 6, 2025
చలికాలంలో ఉదయాన్నే వాకింగ్‌తో నష్టాలే ఎక్కువ!

వాకింగ్ శరీరానికి ఎంతో మంచిది. కానీ చలికాలం ఉదయాన్నే చేసే వాకింగ్‌తో లాభంకంటే నష్టాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ‘చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది. BP పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది. దాంతో తరచూ జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. మంచులో రోడ్డు సరిగ్గా కనిపించక పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.


