News August 30, 2024

విద్యార్థులకు శుభవార్త

image

TG: EAPCETలో క్వాలిఫై కాని వారు బీటెక్‌లో చేరేందుకు అధికారులు స్పాట్ అడ్మిషన్ల ద్వారా అవకాశం కల్పించారు. ఖాళీగా ఉన్న, మిగిలిన సీట్లలో ఎప్‌సెట్ క్వాలిఫై అయిన వారితో పాటు కాని వారు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరవచ్చు. ఇలా చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. ఇందుకోసం విద్యార్థులు SSC, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల, నివాస ధ్రువపత్రాలు సమర్పించాలి.

Similar News

News February 18, 2025

మనూ భాకర్‌కు బీబీసీ పురస్కారం

image

భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంథాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్‌నే పురస్కారం వరించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో మనూ రెండు కాంస్య పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

News February 18, 2025

ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన నేపాల్ PM

image

ఒడిశాలోని కళింగ యూనివర్సిటీలో తమ దేశ విద్యార్థిని ఆత్మహత్య, తదనంతరం చోటు చేసుకున్న <<15495303>>నిరసనలపై<<>> నేపాల్ ప్రధాని కేపీ ఓలీ స్పందించారు. ఢిల్లీలోని తమ ఎంబసీకి చెందిన ఇద్దరు అధికారులను అక్కడికి పంపించినట్లు చెప్పారు. వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. వర్సిటీలోని తమ దేశ విద్యార్థుల ఇష్టప్రకారం కావాలంటే అక్కడి హాస్టల్‌లో, లేదంటే బయట వసతి ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు.

News February 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!