News September 25, 2024

విద్యార్థులకు శుభవార్త

image

దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గతంలో ప్రకటించిన గడువు SEP 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్‌లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News September 25, 2024

ట్రామ్‌లకు త్వరలోనే ‘సెలవు’

image

కోల్‌కతా మహానగరంలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు నిలిచిపోనున్నాయి. దేశంలో ప్రస్తుతం ఈ ఒక్క నగరంలో ట్రామ్ రవాణా సదుపాయం ఉండగా, త్వరలో నిలిపివేస్తామని మంత్రి స్నేహాశీష్ చక్రబర్తి తెలిపారు. నగరంలో పరిమిత వేగంతో ప్రయాణించే ట్రామ్‌ల వల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కోల్‌కతాలో 1873 నుంచి ట్రామ్‌లు సేవలందిస్తున్నాయి.

News September 25, 2024

రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డుల రద్దు?

image

TG: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

News September 25, 2024

దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ

image

TG: దసరాలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 6 ఖాళీల్లో ఇప్పటికే నలుగురి పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వేర్వేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ రెండు బెర్తులు పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కశ్మీర్, హరియాణా ఎన్నికలు ముగిశాక AICC నేతలతో రేవంత్ చర్చలు జరిపి క్యాబినెట్ జాబితా సిద్ధం చేస్తారని సమాచారం.