News September 25, 2024
విద్యార్థులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గతంలో ప్రకటించిన గడువు SEP 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్‌లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <
Similar News
News October 5, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 5, శనివారం
తదియ పూర్తి
స్వాతి: రా.9.33 గంటలకు
వర్జ్యం: తె.3.45 నుంచి ఉ.5.32 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.5.59 నుంచి ఉ.6.46 గంటల వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
News October 5, 2024
టుడే హెడ్ లైన్స్
* లడ్డూ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
* తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన CBN
* పరిపాలనలో బాబు ఫెయిల్: జగన్
* మోదీ డైరెక్షన్‌లో పవన్ నటన: షర్మిల
* TG: ధరణి స్థానంలో కొత్త చట్టం: మంత్రి పొంగులేటి
* సీఎం రేవంత్ మోసగాడు: హరీశ్ రావు
* సురేఖపై రూ.100 కోట్ల దావా వేస్తా: నాగార్జున
* ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి
News October 5, 2024
చైనాలో ఏటా టన్నుల కొద్దీ పాములు స్వాహా!
చైనీయులు ఏటా ఏకంగా 10వేల టన్నులకు పైగా పాముల్ని స్వాహా చేస్తున్నారని ఆ దేశ వన్యప్రాణ సంరక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా షాంఘై, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సుల్లో సర్పాలకు మహా డిమాండ్. ఒక్క షాంఘైలోనే 6వేల వరకూ పాము మాంసం హోటళ్లు ఉండటం గమనార్హం. తాచుపాముల నుంచి సముద్రపు పాముల వరకూ అన్నింటినీ చైనీయులు ఇష్టంగా తినేస్తారు. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత తలెత్తే ప్రమాదం ఉందంటూ సంస్థ హెచ్చరించింది.