News April 15, 2025

విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

image

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <>అప్లై<<>> చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఏప్రిల్ 30న పరీక్ష జరగనుంది.

Similar News

News April 17, 2025

మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News April 17, 2025

BREAKING: డీఎస్సీకి వయోపరిమితి పెంపు

image

AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

News April 17, 2025

ఆ స్టార్ హీరోకు 17 ఏళ్లలో బిగ్గెస్ట్ ఫ్లాప్!

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు చవిచూస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్‌లో రష్మిక హీరోయిన్‌గా భారీ అంచనాలతో మార్చి 30న విడుదలైన ‘సికందర్’ ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.177 కోట్లే వసూలు చేసిందని సినీ వర్గాలు తెలిపాయి. యువరాజ్(2008) తర్వాత సల్మాన్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఫ్లాప్‌ అని పేర్కొన్నాయి.

error: Content is protected !!