News November 6, 2024

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల లోన్

image

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం హామీతో దేశంలోని 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణం లభించనుంది. లోన్‌లో 75% వరకు బ్యాంకులకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుంది. దీనిపై 3 శాతం వడ్డీ రాయితీ ఉండనుంది. ఇందుకోసం కేంద్రం రూ.3,600 కోట్లు కేటాయించనుంది.

Similar News

News July 11, 2025

ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT