News August 6, 2024
టీచర్లకు గుడ్‌న్యూస్
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు ఐఎంఎంఎస్ యాప్‌లో ఈ ఆప్షన్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం రోజుకో ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
Similar News
News September 9, 2024
BREAKING: తీరం దాటిన వాయుగుండం
AP: ఉత్తరాంధ్రను వణికిస్తోన్న తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో నిన్నటి నుంచి కోస్తా, ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఉండనుంది. వాయుగుండం క్రమేపి బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
News September 9, 2024
ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు 2,000 మంది పోలీసులు
ఫిలిప్పీన్స్‌లో అపోలో అనే పాస్టర్ దావోవ్ సిటీలో 75ఎకరాల్లో ది కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట ఓ సామ్రాజ్యం స్థాపించారు. సెక్స్ రాకెట్, డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పాటు వ్యక్తిగత సహాయకులనూ లైంగికంగా వేధించారని అభియోగాలున్నాయి. దీంతో దాదాపు 2వారాల ఆపరేషన్ తర్వాత ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 2,000 మంది పోలీసులు ఓ బంకర్‌లో దాక్కొన్న అపోలోను అరెస్ట్ చేశారు. హెలికాప్టర్లను కూడా వాడారు.
News September 9, 2024
హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: KTR
TG: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని KTR అన్నారు. దానం, కడియం, తెల్లం వెంకట్రావు MLA పదవులు ఊడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.