News November 17, 2024

టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్

image

ఆస్ట్రేలియా టూర్‌లో తొలి మ్యాచ్ మొదలుకాక ముందే గాయాల బెడదతో ఉన్న టీమ్ ఇండియాకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15న ప్రాక్టీస్‌లో గాయపడ్డ KL రాహల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మోచేతికి బంతి బలంగా తాకడంతో ఆయన నొప్పితో మైదానం వీడారు. దీంతో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రాహుల్ అనుమానమేనన్న వార్తలు వచ్చాయి. ఈరోజు ఆయన తిరిగి ప్రాక్టీస్ చేయడంతో అంతా సర్దుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 9, 2024

ఎంత దూరమైనా వలస వెళ్లిపోతాయ్!

image

సీజన్‌ను బట్టి పక్షులు వేల కిలోమీటర్లు వలస వెళ్తుంటాయి. దీనిపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు చేసింది. చియులువాన్2 అనే మగ గద్ద మణిపుర్ నుంచి కెన్యా, టాంజానియా, మలావి, జాంబియా గుండా సోమాలియాకు చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని ఉపగ్రహం ద్వారా గుర్తించారు. 3వేల కిలోమీటర్లను 5 రోజుల 17 గంటల్లో చేరుకుంది. గ్వాంగ్‌రామ్ అనే ఆడ గద్ద కూడా నాన్‌స్టాప్‌గా ప్రయాణించగలదని పరిశోధనలో తేలింది.

News December 9, 2024

అల్లు అర్జున్.. మేమంతా మీ అభిమానులం: బిగ్ బి

image

తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై అమితాబ్ స్పందించారు. ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువ చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. మీకు మరిన్ని సక్సెస్‌లు రావాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News December 9, 2024

ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చింది ఈరోజే!

image

ట్రాఫిక్ రూల్స్‌లో ఎంతో ముఖ్యమైన సిగ్నల్ లైట్స్ మొట్ట మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది ఈరోజే. డిసెంబర్ 9, 1868న ప్రపంచంలో తొలిసారిగా లండన్‌లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ గ్యాస్ ల్యాంప్స్ ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. అయితే, దురదృష్టవశాత్తు నెలరోజుల్లోనే పేలుడు సంభవించడంతో ఈ ప్రయోగానికి ముగింపు పలికారు.