News January 30, 2025

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీనిని అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లి పట్టీ, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ఆదేశించింది. ఒక్కో స్టూడెంట్‌కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. MAR 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

Similar News

News February 20, 2025

ఫాస్టాగ్ 70 నిమిషాల రూల్‌పై NHAI క్లారిటీ

image

టోలో‌ప్లాజాకు చేరుకునే ముందు 60 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. FEB 17 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై NHAI క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యూలర్ జారీ చేసిందని వెల్లడించింది.

News February 20, 2025

BREAKING: జగన్‌పై కేసు నమోదు

image

AP: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.

News February 20, 2025

Beautiful Photo: రోహిత్ ఖుషీ.. టీమ్ జోష్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు బంగ్లాతో తలపడేందుకు భారత జట్టు నేడు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించింది. ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో జట్టు ఆటగాళ్లంతా రోహిత్ చుట్టూ చేరి నవ్వుతూ కనిపించారు. రోహిత్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులు హిట్‌మ్యాన్‌పై చూపే ప్రేమ, ఆప్యాయతకు ఇది నిదర్శమని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.

error: Content is protected !!