News November 8, 2024

‘టెట్’ అభ్యర్థులకు శుభవార్త

image

TG: మేలో టెట్ రాసి ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకునేవారికి దరఖాస్తు ఫీజు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో క్వాలిఫై అయినా, కాకపోయినా అప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా ఈసారి ఉచితంగా ఎగ్జామ్ రాయొచ్చని పేర్కొంది. ఇక మేలో పెంచిన టెట్ దరఖాస్తు ఫీజును ఈసారి తగ్గించింది. గతంలో ఒక పేపర్‌కు రూ.1000, రెండు రాస్తే రూ.2000 ఉండగా ఇప్పుడు దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా నిర్ధారించింది.

Similar News

News December 13, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ICC ఓకే!

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌కు ICC ఆమోదం తెలిపినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. BCCI, PCB ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నాయి. IND ఆడే మ్యాచులు దుబాయ్‌లో, ఇండియాVSపాక్ మ్యాచ్ మాత్రం కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం. IND మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయినందుకు PCBకి ఎలాంటి ఆర్థిక పరిహారం ఇవ్వరని, 2027 తర్వాత ICC ఉమెన్స్ టోర్నమెంట్ హోస్టింగ్ హక్కులను మాత్రం ఇస్తారని తెలుస్తోంది.

News December 13, 2024

రాహుల్ గాంధీకి అల‌హాబాద్ కోర్టు స‌మ‌న్లు

image

జోడో యాత్ర‌లో సావ‌ర్క‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై రాహుల్ గాంధీకి లక్నో కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. సావ‌ర్క‌ర్ బ్రిటిష్ పాల‌కుల‌కు సేవ‌లందించార‌ని, పింఛ‌న్ కూడా తీసుకున్నారంటూ రాహుల్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఓ న్యాయ‌వాది పిటిష‌న్ వేశారు. దీనితో ఏకీభవించిన కోర్టు అభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు జనవరి 10న త‌మ ముందు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది.

News December 13, 2024

బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్

image

ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి అయ్యారు. తాను బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. బిడ్డకు పాలిస్తూ ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న ఫొటోను ఆమె పంచుకున్నారు. 2011లో బ్రిటన్‌కు చెందిన బెనెడిక్ట్ టేలర్‌తో లివింగ్ టుగెదర్ తర్వాత 2012లో ఆమె పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.