News February 10, 2025

దివ్యాంగులకు గుడ్ న్యూస్

image

దివ్యాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పాసులు పొందడానికి వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో కొత్త పాసులతో పాటు పాతవి రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులోనే దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు మంజూరు చేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://divyangjanid.indianrail.gov.in/

Similar News

News September 18, 2025

జీకేవీధి: పాము కాటుకు గురై బాలిక మృతి

image

గూడెం కొత్తవీధిలోని బొంతువలసకు చెందిన మర్రి కవిత (9) పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంట్లో పడుకున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.