News February 10, 2025
దివ్యాంగులకు గుడ్ న్యూస్

దివ్యాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పాసులు పొందడానికి వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో కొత్త పాసులతో పాటు పాతవి రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులోనే దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు మంజూరు చేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://divyangjanid.indianrail.gov.in/
Similar News
News March 25, 2025
నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

TG: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదని తెలిపారు. ‘సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించా. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం’ అని పేర్కొన్నారు.
News March 25, 2025
క్రికెటర్ తమీమ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన డాక్టర్లతో మాట్లాడుతున్నారు. తమీమ్‌కు గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు దాదాపు 22 నిమిషాలపాటు CPR చేశారు. అనంతరం మూడుసార్లు DC షాక్ ఇచ్చారు. వెంటనే స్టెంట్లు అమర్చారు. దీంతో తమీమ్ మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా నిన్న ఓ మ్యాచ్ సందర్భంగా తమీమ్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
News March 25, 2025
Stock Markets: 800 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

స్టాక్‌మార్కెట్లు మరోసారి ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయుల నుంచి కనిష్ఠానికి పడిపోయాయి. సెన్సెక్స్ 78,741 నుంచి మధ్యాహ్నం 800PTS మేర కుంగి 77,912 వద్ద కనిష్ఠాన్ని టచ్ చేసింది. ప్రస్తుతం 78,023 (47) వద్ద చలిస్తోంది. నిఫ్టీ 23,869 నుంచి 23,627కు పడిపోయింది. 23,687 (30) వద్ద ట్రేడవుతోంది. సూచీకి 23800 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉంది. ట్రంప్ టారిఫ్స్‌తో నెగటివ్ సెంటిమెంటు పెరిగింది.