News February 8, 2025

భారత జట్టుకు గుడ్‌న్యూస్

image

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడనున్నారు. కోహ్లీ ఫిట్‌గానే ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. రేపు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Similar News

News March 24, 2025

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

image

MMTS రైలు <<15866506>>ఘటనపై<<>> MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నా’ అని తెలిపారు.

News March 24, 2025

జోనర్ మార్చిన వరుణ్ తేజ్

image

కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోనర్ మార్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ చిత్రంలో ఆయన నటించేందుకు పచ్చ జెండా ఊపారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.

News March 24, 2025

వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల

image

TG: ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నామని, రూ.20వేల కోట్లు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను మోసం చేసిన పార్టీలకు దీనిపై మాట్లాడే హక్కు లేదని అసెంబ్లీలో MLA పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుభరోసా నిధులు ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు.

error: Content is protected !!