News December 26, 2024
కొత్త ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉంది.
Similar News
News January 24, 2025
శుభ ముహూర్తం (24-01-2025)
✒ తిథి: బహుళ దశమి తె.4.53 వరకు ✒ నక్షత్రం: అనురాధ తె.3.07 వరకు ✒ శుభ సమయములు: సా.4.32 నుంచి 5.20 వరకు ✒ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ✒ యమగండం: ఉ.3.00-4.30 వరకు ✒ దుర్ముహూర్తం: 1) ఉ.8.24-9.12 వరకు 2) సా.6.16-8.00 వరకు ✒ వర్జ్యం: ఉ.7.52-9.36 వరకు ✒ అమృత ఘడియలు: సా.6.16-8.00 వరకు
News January 24, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 24, 2025
నేటి ముఖ్యాంశాలు
* ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటన
* తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
* ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
* టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు
* మే నెలలో ‘తల్లికి వందనం’: డీబీ వీరాంజనేయ స్వామి
* దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి
* మూడో రోజూ సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ సోదాలు