News March 10, 2025
ఇళ్లు కట్టుకునే వారికి GOOD NEWS

AP: ఇళ్లు కట్టుకునే SC, ST, BC లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, STలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1లక్ష సాయం అందనుంది. PMAY(అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15వేలు అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
Similar News
News November 25, 2025
ఆశ్లేష కురిస్తే ముసలియెద్దూ రంకెవేస్తుంది..

ఆశ్లేష నక్షత్రంలో ( జూలై చివరిలో/ ఆగస్టు ప్రారంభంలో) వర్షాలు బాగా పడితే, ఆ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయని, పచ్చగడ్డి, మేత పుష్కలంగా లభిస్తాయని రైతులకు నమ్మకం. ఈ సమృద్ధి కారణంగా, సాధారణంగా నీరసంగా లేదా బలహీనంగా ఉండే ముసలి ఎద్దులు కూడా కడుపునిండా తిని, కొత్త శక్తిని పొంది, సంతోషంతో ఉత్సాహంగా అరుస్తాయనేది ఈ సామెత భావం. మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారని అర్థం
News November 25, 2025
శివుడి అవతారమే హనుమంతుడు

హనుమంతుడు అంజనా దేవి పుత్రుడు. శివుడి వంటి పుత్రుడిని పొందాలని పరమేశ్వరుడికి పూజలు చేసింది. ఆ పూజల ఫలితంగా శివుడి వరంతోనే హనుమంతుడు జన్మించాడు. ఆయనను శివుని అవతారంగా భావిస్తారు. శివుడి లాగే ఆయన కూడా పరిపూర్ణ యోగి. అష్ట సిద్ధులకు యజమాని. ఆయన తన దైవశక్తిని ఏనాడూ స్వార్థానికి ఉపయోగించలేదు. తన ప్రభువు రాముడిని సేవించడానికి మాత్రమే వినియోగించారు. ఆయనను పూజిస్తే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట.
News November 25, 2025
సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

TG: కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు సెక్రటేరియట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. అటు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.


