News March 10, 2025

ఇళ్లు కట్టుకునే వారికి GOOD NEWS

image

AP: ఇళ్లు కట్టుకునే SC, ST, BC లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, STలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1లక్ష సాయం అందనుంది. PMAY(అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15వేలు అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.

Similar News

News March 26, 2025

జిన్‌పింగ్ కుటుంబీకుల వద్ద భారీగా అవినీతి ఆస్తులు!

image

దేశంలో అవినీతిని వేటాడుతున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతుంటారు. కానీ వారి కుటుంబమే రూ.కోటానుకోట్లు వెనకేసిందని రేడియో ఫ్రీ ఏషియా నివేదిక తెలిపింది. ‘2012లో అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి జిన్‌పింగ్ అవినీతి నిరోధక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీలోని వేలాదిమందిని అరెస్ట్ చేశారు. అయితే తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల్లో జిన్‌పింగ్ కుటుంబం భారీగా కూడబెట్టింది’ అని వెల్లడించింది.

News March 26, 2025

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

News March 26, 2025

శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

image

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

error: Content is protected !!