News November 4, 2024
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
TG: పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.
Similar News
News December 9, 2024
ఎంత దూరమైనా వలస వెళ్లిపోతాయ్!
సీజన్‌ను బట్టి పక్షులు వేల కిలోమీటర్లు వలస వెళ్తుంటాయి. దీనిపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు చేసింది. చియులువాన్2 అనే మగ గద్ద మణిపుర్ నుంచి కెన్యా, టాంజానియా, మలావి, జాంబియా గుండా సోమాలియాకు చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని ఉపగ్రహం ద్వారా గుర్తించారు. 3వేల కిలోమీటర్లను 5 రోజుల 17 గంటల్లో చేరుకుంది. గ్వాంగ్‌రామ్ అనే ఆడ గద్ద కూడా నాన్‌స్టాప్‌గా ప్రయాణించగలదని పరిశోధనలో తేలింది.
News December 9, 2024
అల్లు అర్జున్.. మేమంతా మీ అభిమానులం: బిగ్ బి
తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై అమితాబ్ స్పందించారు. ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువ చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. మీకు మరిన్ని సక్సెస్‌లు రావాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
News December 9, 2024
ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చింది ఈరోజే!
ట్రాఫిక్ రూల్స్‌లో ఎంతో ముఖ్యమైన సిగ్నల్ లైట్స్ మొట్ట మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది ఈరోజే. డిసెంబర్ 9, 1868న ప్రపంచంలో తొలిసారిగా లండన్‌లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ గ్యాస్ ల్యాంప్స్ ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. అయితే, దురదృష్టవశాత్తు నెలరోజుల్లోనే పేలుడు సంభవించడంతో ఈ ప్రయోగానికి ముగింపు పలికారు.