News March 20, 2024
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతోంది. రూ.300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామివారిని 63,251మంది దర్శించుకోగా.. వారిలో 20,989మంది తలనీలాలు ఇచ్చారన్నారు. రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Similar News
News January 27, 2026
ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం

ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్నట్లు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. ఈ ఏడాదే గగన్‌యాన్-1 తొలి మానవరహిత ప్రయోగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. G-1, G-2, G-3 మిషన్ల అనంతరం 2027 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది 20-25 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఫిబ్రవరి లేదా మార్చిలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నామని అన్నారు.
News January 27, 2026
పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.
News January 27, 2026
మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు

TG: రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతర నేపథ్యంలో హాలిడేస్ ప్రకటించాలని పేరెంట్స్ అంటున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇవాళో, రేపో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


