News December 4, 2024
UPI పేమెంట్స్ చేసేవారికి గుడ్‌న్యూస్

UPI లైట్ వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు RBI ప్రకటించింది. ఒక్కో లావాదేవీ పరిమితిని కూడా రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ద్వారా పిన్ ఎంటర్ చేయకుండానే UPI పేమెంట్స్ చేయొచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకునేందుకు ముందుగా వాలెట్‌లో బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి.
Similar News
News January 16, 2026
ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

అధికారికంగా కాకపోయినా ట్రంప్ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.
News January 16, 2026
ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
News January 16, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


