News June 22, 2024

హాస్టళ్లలో ఉండే వారికి GOOD NEWS

image

పలు వస్తువులు, సేవలపై GSTని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సంబంధం లేని హాస్టళ్లను GST నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే నెలకు రూ.20వేల కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్లకే ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల సిటీల్లో విద్య, ఉపాధి కోసం వచ్చిన వారికి ఊరట కల్గనుంది. ఇప్పటికే విద్యాసంస్థల హాస్టళ్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.

Similar News

News November 8, 2024

తిరుమలలో అన్యమతస్థులపై వేటు?

image

AP: తిరుమలలో అన్యమతస్థుల అంశం ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. గతంలో అన్యమత ఉద్యోగులను గుర్తించి జాబితా రెడీ చేశారు. అయితే వారిని తిరుమల నుంచి తప్పించే చర్యలు మాత్రం ముందుకు సాగలేదు. ఇటీవల టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్యమతస్థుల స్వచ్ఛంద బదిలీలకు అవకాశం కల్పించి పంపించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

News November 8, 2024

లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమ వాళ్లు కనిపించడం లేదని పిటిషనర్ల తరఫు లాయర్లు న్యాయమూర్తికి వివరించగా, మధ్యాహ్నం 2.30కు విచారిస్తామని జడ్జి తెలిపారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఏజీ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

News November 8, 2024

ఆత్మహత్య చేసుకున్న యువ నటుడు

image

హిందీ TV నటుడు నితిన్ చౌహాన్(35) ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. మరో నటుడు విభూతి ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ ‘నా ప్రియమైన నితిన్ విశ్రాంతి తీసుకోండి. మీ మరణ వార్త తెలిసి నిజంగా షాక్ అయ్యాను’ అని పేర్కొన్నారు. దాదాగిరి- 2 షో విజేతగా నిలిచిన నితిన్ MTV స్ప్లిట్స్‌విల్లా 5, క్రైమ్ పెట్రోల్ & తేరా యార్ హూన్ మెయిన్ వంటి షోలలో నటించారు.