News January 9, 2025
స్విగ్గీ స్టాక్స్ కొన్న వారికి గుడ్ న్యూస్!
ఫుడ్ డెలివరీ స్టాక్ స్విగ్గీకి అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బెర్న్ స్టెయిన్ బై రేటింగ్ ఇచ్చింది. అలాగే టార్గెట్ ప్రైస్‌ను రూ.635గా సెట్ చేసింది. తద్వారా 22% రాబడుల్ని అంచనా వేసింది. గత రెండు వారాల్లో 20% వరకు నష్టపోయిన షేరు ధర తాజా రేటింగ్‌తో గురువారం సెషన్‌లో 6% వరకు ఎగసింది. ట్రేడింగ్ ముగిసే నాటికి 3.45% లాభపడి రూ.506.55 వద్ద స్థిరపడింది.
Similar News
News January 26, 2025
పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు నాలుగైనా ఇవ్వాలి కదా?: రేవంత్
TG: ‘పద్మ’ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. ‘పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తాం’ అని వెల్లడించారు.
News January 26, 2025
ఆ ప్రచారం నమ్మొద్దు.. ‘RC 16’ టీమ్
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన టీమ్ ఇందులో వాస్తవం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News January 26, 2025
నేడు మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్‌లో నిర్వహించనుంది. ‘సంవిధాన్’ పేరిట రేపు జరిగే ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.