News August 13, 2024
US వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం దేశంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి 26 వరకు ఈ ఫెయిర్ కొనసాగుతుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, పుణే, ముంబైలో వీటిని ఏర్పాటు చేస్తారు. 80కిపైగా వర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లో అందుబాటులో ఉంటారు. ప్రవేశం ఉచితం కాగా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి.
Similar News
News September 15, 2024
ఇడ్లీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇడ్లీ తినడం వల్ల చనిపోయారు. ఓనం పండుగ సందర్భంగా అక్కడ పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సురేశ్(49) అనే వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొన్నారు. ఒకేసారి మూడు ఇడ్లీలు తినగా అవి గొంతులో ఇరుక్కున్నాయి. ఊపిరాడక కుప్పకూలిన అతన్ని నిర్వాహకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.
News September 15, 2024
వారికి కోరుకున్న చోట స్థలాలిస్తాం: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములిచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వచ్చి భూములు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలిస్తామని తెలిపారు. ఐఐటీ రిపోర్ట్ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులు చేపడతామన్నారు.
News September 15, 2024
రేవంత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు: హరీశ్
TG: అరెకపూడి గాంధీ కాంగ్రెస్ MLA అని CM రేవంత్ ఇవాళ తన వ్యాఖ్యలతో ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘మనోళ్లే వాళ్లింటికి వెళ్లి తన్నారని రేవంత్ అన్నారు. అంటే గాంధీ వాళ్లోడే అన్నట్టుగా. సీఎం మాటలు చూస్తుంటే తానే దాడి చేయించానని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. మళ్లీ పైనుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.