News February 17, 2025
బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్లే TGSRTC బస్సుల్లో డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ రూట్‌లో నడిచే అన్ని సర్వీసుల్లో రానుపోనూ టికెట్ ధరలో 10శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. దీని వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందన్నారు. దీంతో సూపర్ లగ్జరీ, NAC సీటర్, రాజధాని, AC సీటర్, AC స్లీపర్ ధరలు తగ్గుతాయని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News March 17, 2025
మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి: KTR

TG: జర్నలిస్టులను రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని KTR అన్నారు. CMను విమర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేసి జైలుపాలైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రేవతి, తన్వికి జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకూ జరగొచ్చు. మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. కాగా రేవతి, తన్వికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
News March 17, 2025
BREAKING: ఫలితాలు విడుదల

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.
News March 17, 2025
కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స

AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.