News January 28, 2025
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో దిగనుండగా ఆ మ్యాచ్ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు లేవని వార్తలు రావడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. తాజాగా ఆ మ్యాచ్‌ను ‘Jio Cinema’ టెలికాస్ట్ చేసేందుకు ముందుకొచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఢిల్లీ vs రైల్వేస్ రంజీ ట్రోఫీలో భాగంగా పోటీ పడనున్న విషయం తెలిసిందే. నిన్న 20 మంది సభ్యులతో ఢిల్లీ ప్రకటించిన జట్టులో కోహ్లీకి చోటు దక్కిన విషయం తెలిసిందే.
Similar News
News February 8, 2025
నేడే CCL ప్రారంభం.. గ్రౌండులో సత్తా చాటనున్న సినీ స్టార్లు

సెలబ్రిటి క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. మ.2 గంటలకు బెంగళూరు వేదికగా చెన్నై రైనోస్VSబెంగాల్ టైగర్స్, సా.6 గంటలకు తెలుగు వారియర్స్VSకర్ణాటక బుల్డోజర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 2 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్లు బ్యాట్, బంతితో సత్తా చాటనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో HYDలో నాలుగు మ్యాచులున్నాయి.
News February 8, 2025
రాహుల్ గాంధీతో నాకు విభేదాల్లేవు: సీఎం రేవంత్

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు అగాథమేర్పడిందన్న వార్తల్ని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ఆయన తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘మధ్యప్రదేశ్ సభలో తెలంగాణ CM బాగా చేస్తున్నాడంటూ కొనియాడారు. కులగణనపై ఆయనతో చర్చిస్తూనే ఉన్నాం. ఆయన ఆమోదం లేకుండా చేస్తామా..? రాహుల్‌తో నా సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.
News February 8, 2025
GOOD NEWS.. వారికి రూ.12,000

AP: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అగ్రికల్చర్, పశువైద్య విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను ₹7K నుంచి ₹10Kకు, PG స్టూడెంట్లకు ₹12Kకు పెంచింది. అలాగే సన్న రకం వరి సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాదవ, కురబలకు BC కార్పొరేషన్ ద్వారా గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.