News August 3, 2024

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: ఉద్యోగినుల కోసం అవసరమైన ప్రతిచోటా మహిళా హాస్టళ్లను ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్, డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆ వసతి గృహాల పక్కనే పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. భవనాలను ప్రభుత్వమే అద్దెకు తీసుకుని నిర్వహించనుంది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

Similar News

News December 5, 2025

చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

image

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.

News December 5, 2025

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్‌ 2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News December 5, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.