News August 3, 2024

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: ఉద్యోగినుల కోసం అవసరమైన ప్రతిచోటా మహిళా హాస్టళ్లను ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్, డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆ వసతి గృహాల పక్కనే పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. భవనాలను ప్రభుత్వమే అద్దెకు తీసుకుని నిర్వహించనుంది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

Similar News

News December 10, 2025

మన్యం: బాబోయ్ వణుకు..!

image

పాచిపెంటలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సాయంత్రం 4 దాటిన తరువాత చలి తీవ్రత పెరిగి చలి మంటలు వేసుకుంటూ రక్షణ పొందుతున్నారు. ఉదయం పూట మంచు అధికంగా పడటంతో 7 గంటలు దాటితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది? కామెంట్

News December 10, 2025

గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

image

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.

News December 10, 2025

తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

image

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.