News February 24, 2025

మహిళలకు GOOD NEWS.. కొత్త పథకాలు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మరిన్ని పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు చమురు సంస్థలతో చర్చిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను రూ.2 లక్షలు, రూ.లక్షకు పెంచనుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు, అంగన్వాడీలు, సహాయ సంఘాల సభ్యులకు చీరలు అందించనుంది.

Similar News

News March 27, 2025

ప్రపంచ కుబేరుల కొత్త జాబితా!

image

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఎలాన్ మస్క్ $420 బిలియన్ల(దాదాపు రూ.36 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికయ్యాక మస్క్ ఆస్తి భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. వీరి తర్వాత వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.

News March 27, 2025

ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

image

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

News March 27, 2025

2 రోజులు సెలవులు

image

TG: రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (సోమవారం) ఈద్ ఉల్ ఫితర్‌తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న (మంగళవారం) కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.

error: Content is protected !!