News April 7, 2025
గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లో రూ.1,00,000 జమ!

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశలో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా వీరిలో 12వేల మంది నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 1,200 మంది బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి చేశారు. వీరి ఖాతాల్లో తొలి విడతగా ఈ వారమే రూ.లక్ష జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు డబ్బుల్లేక పనులు ప్రారంభించని వారికి డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు అందించాలని నిర్ణయించారు.
Similar News
News April 9, 2025
అమరావతిలో పెరిగిన భూముల అమ్మకాలు!

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో భూముల విక్రయాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో చాలా మంది ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు, లాజిస్టిక్ పార్క్ వచ్చే అవకాశం ఉండటంతో రియల్ఎస్టేట్ ఊపందుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ గజం రేటు రూ.20వేలకు పైగా పెరిగిపోయినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
News April 9, 2025
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం

తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
News April 9, 2025
RRతో మ్యాచ్.. గుజరాత్ బ్యాటింగ్

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో GTతో మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్: జైస్వాల్, సంజూ శాంసన్ (C), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, ఆర్చర్, తీక్షణ, ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే
గుజరాత్: సాయి సుదర్శన్, గిల్ (C), బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ