News December 15, 2024
భూమిలేని నిరుపేదలకు రూ.12వేలు: భట్టి
TG: భూమిలేని నిరుపేద కుటుంబానికి రూ.12వేలు ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ‘ఏడాదికి 2 విడతల్లో డబ్బులు జమ చేస్తాం. డిసెంబర్ 28న తొలివిడత అందిస్తాం. రైతు భరోసా డబ్బులనూ సంక్రాంతి సమయంలో రైతులకు అందిస్తాం. రైతులకు రుణమాఫీ చేశాం. ఎకరానికి రూ.10వేలు పంట నష్ట పరిహారం చెల్లించాం. రైతు బీమా కూడా చెల్లిస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం’ అని భట్టి ఖమ్మంలో మీడియాతో చెప్పారు.
Similar News
News January 25, 2025
జగన్, VSR కలిసి డ్రామా ఆడుతున్నారు: బుద్దా వెంకన్న
AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్‌కు తెలిసే జరిగిందని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.
News January 25, 2025
నేడు VSR రాజీనామా
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఉపరాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉ.10.30 గంటలకు ఆయనను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. కాగా, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని VSR తెలిపారు. తాను ఏ రాజకీయా పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు.
News January 25, 2025
ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
2008 ముంబై దాడుల కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అతడి అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను తాజాగా కొట్టేసింది. దీంతో నేరగాళ్ల ఒప్పందం ప్రకారం త్వరలోనే అమెరికా రాణాను భారత్‌కు సరెండర్ చేయనుంది. పాకిస్థాన్ ISI, లష్కరే తోయిబాతో సంబంధాలున్న అతడే ముంబై పేలుళ్ల సూత్రధారి అని గతంలో IND ఆధారాలు సమర్పించింది.