News October 5, 2024
GOOD NEWS: నేడు అకౌంట్లలోకి రూ.2,000
దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.20వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీం కింద ప్రతి 4 నెలలకు ఓసారి రూ.2వేల చొప్పున మొత్తం 3 విడతల్లో రూ.6వేలను అన్నదాతల అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు.
Similar News
News November 12, 2024
దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ల విలువ తెలిస్తే షాకవుతారు!
ఇండియా గ్రోత్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై దేశీయ ఇన్వెస్టర్ల నమ్మకం మరింత బలపడింది. మార్కెట్ సెంటిమెంటును పట్టించుకోకుండా దీర్ఘకాల దృక్పథంతో మెచ్యూరిటీతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడే ఇందుకో ఉదాహరణ. ప్రస్తుతం MF AUM ఆల్‌టైమ్ హై రూ.67.26 లక్షల కోట్లకు చేరడం విశేషం. రిటైల్ ఫోలియోస్ 17.23 కోట్లు, SIP అకౌంట్లు 10 కోట్లు దాటేశాయి. మంత్లీ సిప్ ఇన్‌ఫ్లో రూ.25వేల కోట్లంటే మాటలు కాదు.
News November 12, 2024
DANGER: స్నానానికి స్క్రబ్స్ వాడుతున్నారా?
సబ్బు, బాడీ వాష్‌లకు అదనంగా చర్మం మృదువుగా మారడానికి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి స్క్రబ్స్(సింథటిక్/ప్లాంట్ ఫైబర్)ను వాడటం పెరిగింది. అయితే వీటిని ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తగలకపోవడం వల్ల స్క్రబ్స్‌పై బాక్టీరియా, సూక్ష్మక్రిములు, బూజు పేరుకుపోతాయంటున్నారు. దీంతో చర్మ వ్యాధులు, అలర్జీలు పెరుగుతాయని చెబుతున్నారు.
News November 12, 2024
ఢిల్లీకి రేవంత్.. క్యాబినెట్ విస్తరణ ఉంటుందా?
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం చర్చిస్తారని సమాచారం.