News December 2, 2024
GOOD NEWS: జాబ్ లేని వారికి రూ.5,000

పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000, వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6000 ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. 21-24 ఏళ్ల మధ్య వయసుండి, నవంబర్ 30 వరకు ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయినవారు దీనికి అర్హులు. దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <
Similar News
News January 13, 2026
జనవరి 13: చరిత్రలో ఈరోజు

✯1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
✯1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
✯1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
✯1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
✯1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
✯2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం
News January 13, 2026
ముగ్గురు ఇండియన్లను రిలీజ్ చేసిన అమెరికా!

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. ఇవాళ వారిని అధికారులు రిలీజ్ చేశారు. ముగ్గురి క్షేమ సమాచారం కోసం భారత అధికారులు USతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఒత్తిడి నేపథ్యంలో వారిని విడుదల చేశారు. నార్త్ అట్లాంటిక్‌లో రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను ఈనెల 7న US స్వాధీనం చేసుకుంది. అందులోని 28 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.
News January 13, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


